1. Home
 2. సంఘ మార్గదర్శకాలు

సంఘ మార్గదర్శకాలు

మీ జీవితాలలోని ముఖ్యమైన సంఘటనలను నేరుగా మీ స్మార్ట్‌ఫోన్‌ల నుండే సంగ్రహించి, పంచుకోవడంలో TikTok మీకుసహాయపడుతుంది. భావ వ్యక్తీకరణలోని తేడాలను గమనిస్తూనే, చిన్న వీడియోల ద్వారా మీ సృజనాత్మకమైన ఆలోచనలను పంచుకోవడంద్వారా అంతర్జాతీయ TikTok సంఘంలో భాగం అవ్వండి.

TikTok సంఘం మార్గదర్శకాలను మేము కాలానుగుణంగా మారుస్తూ ఉంటాము, సురక్షితమైన, స్నేహపూర్వకమైన వాతావరణంలో ఇదిముఖ్యమైన ప్రవర్తనా నియమావళి. మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే, మీ ఖాతా మరియు/లేదా కంటెంట్ తీసివేయబడవచ్చు. అలాగే, వినియోగదారులు తప్పక స్థానిక చట్టాలను అనుసరించాలి. వర్తించే చట్టం అనుమతించిన పరిధి మేరకు, కంటెంట్‌ని పర్యవేక్షించి, అధికారికసంస్థలకు నివేదించగల హక్కు మాకు ఉంది.

సంఘంలో అందరికీ విశ్వసనీయత, మర్యాద, సానుకూల పర్యావరణాన్ని అందించడం కోసం మా విధానాలు, మార్గదర్శకాలురూపొందించబడ్డాయి.

TikTokలో కింది వాటిని పోస్ట్ చేయకూడదు, పంచుకోకూడదు లేదా ప్రచారం చేయకూడదు, వీటితో సహా:

హానికరమైన లేదా ప్రమాదకరమైన కంటెంట్

మీరు TikTokని ఉపయోగిస్తున్నారు అంటే, మీరు ఒక అంతర్జాతీయ సంఘంలో చేరుతున్నారు అని అర్థం. భౌతికంగా, భావోద్వేగపూరితంగా, ఆర్థికంగా లేదా చట్టపరంగా ఇతర వినియోగదారులకు హాని కలిగించే లేదా అందుకు ఇతరులను ప్రోత్సహించే కంటెంట్‌ని పోస్ట్ చేయవద్దులేదా పంచుకోవద్దు.

 • ఉగ్రవాద సంస్థలు మరియు ఇతర నేరపూరిత సంస్థలు అస్సలు TikTokని ఉపయోగించకూడదు. ఈ సంస్థలు లేదా వ్యక్తులను ప్రచారంచేయడం మరియు వారికి మద్దతివ్వడం కోసం TikTokని ఉపయోగించవద్దు.
 • హానికరమైన చర్యలు, స్వీయ గాయం లేదా ఆత్మహత్యను చూపించే కంటెంట్‌ని పోస్ట్ చేయవద్దు, పంచుకోవద్దు లేదా పంపవద్దు లేదాఅటువంటి కార్యకలాపాలను చేయాలని ఇతరులను ప్రోత్సహించే కంటెంట్‌ని అందించవద్దు.
 • తినడంలో లోపాలను ప్రదర్శించే, ప్రచారం చేసే, ప్రోత్సహించే లేదా సూచనలను అందించే కంటెంట్‌ని పోస్ట్ చేయవద్దు, పంచుకోవద్దులేదా పంపవద్దు.
 • నిర్దిష్ట వ్యక్తికి వ్యతిరేకంగా భౌతికదాడులు చేసే విధంగా భయపెట్టడంతో పాటు ఇతర వ్యక్తులను రెచ్చగొట్టడం లేదా భయపెట్టడం వంటివిచేయవద్దు.
 • ఆయుధాలు, బాంబుులు, మత్తుపదార్తాలు లేదా స్థానిక చట్టాల ప్రకారం ఇతర నిషేధిత వస్తువులను విక్రయించడం లేదాప్రోత్సహించడం కోసం TikTokని ఉపయోగించవద్దు.
 • ఆన్‌లైన్ జూదం లేదా ఇతర ఆర్థిక పథకాలను ప్రోత్సహించే లేదా ప్రచారం చేసే విధంగా TikTokని ఉపయోగించవద్దు.
 • చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలను కలిగిన కంటెంట్‌ని పోస్ట్ చేయవద్దు, పంచుకోవద్దు లేదా పంపవద్దు.
 • గ్రాఫిక్ లేదా షాకింగ్ కంటెంట్

TikTokలో గ్రాఫిక్, హింస, షాకింగ్ లేదా సంచలనాత్మకమైన కంటెంట్‌ని పోస్ట్ చేయవద్దు. మీరు ఈ కంటెంట్‌ని మీ తల్లిదండ్రులకు లేదాపిల్లలకు చూపకూడదు అనుకుంటే, దానిని ఇక్కడ పోస్ట్ చేయవద్దు.

 • హింస, గ్రాఫిక్, షాకింగ్ లేదా సంచలన కంటెంట్‌ని పోస్ట్ చేయవద్దు, పంచుకోవద్దు లేదా పంపవద్దు లేదా ఇతరులు హింసకుపాల్పడుతున్నట్లు చూపుతున్న కంటెంట్‌ని అందించవద్దు.

వివక్ష లేదా ద్వేషపూరిత ప్రసంగం

TikTokలో అందరికీ సమాన గౌరవం లభిస్తుంది. ఇతర వినియోగదారులపై దాడులు చేయడం లేదా హింసకు పాల్పడం వంటివి నిషేధం.

 • జాతి, జాతి మూలం, మతం, జాతీయత, సంస్కృతి, వైకల్యం, లైంగిక ధోరణి, లింగం, లింగం గుర్తింపు, వయస్సు లేదా ఇతర వివక్షఆధారంగా ఒక సమూహానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని ప్రేరేపించే కంటెంట్‌ని పోస్ట్ చేయవద్దు, పంచుకోవద్దు లేదా పంపవద్దు.
 • ట్రోలింగ్ లేదా రెచ్చగొట్టే చర్యలతో పాటు వైరాన్ని పెంచే కంటెంట్‌ని పోస్ట్ చేయవద్దు, పంచుకోవద్దు లేదా పంపవద్దు.

నగ్నత్వం లేదా లైంగిక కార్యకలాపం

లైంగికంగా ప్రేరేపింటే కంటెంట్ లేదా లైంగిక సంతృప్తి కలిగిన కంటెంట్‌ని మా సంఘంలో అనుమతించము. మీరు పబ్లిక్‌గా ప్రదర్శించలేనిదేనినీ కూడా ఇందులో పోస్ట్ చేయవద్దు.

 • లైంగిక దాడి, లైంగిక దుర్వినియోగం, లైంగికంగా వాడుకోవడం లేదా లైంగిక హింసను కలిగిన, ప్రచారం చేసే లేదా ప్రోత్సహించేకంటెంట్‌ని TikTok అస్సలు అనుమతించదు. అటుంటి కంటెంట్‌ని పోస్టే చేయవద్దు.
 • లైంగికంగా ప్రేరేపించే, శృంగారాన్ని లేదా నగ్నత్వాన్ని కలిగిన కంటెంట్‌ని పోస్ట్ చేయవద్దు.
 • వ్యభిచారం, యాచన లేదా ఇతర రకాల లైంగిక వ్యాపారాలకు సంబంధించిన కంటెంట్‌ని అందించవద్దు.

పిల్లల భద్రతకు సంబంధించిన ఉల్లంఘనలు

TikTokలో పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యత లభిస్తుంది. పిల్లల్ని ఎవరైనా లైంగికంగా ఇబ్బంది పెడుతున్నట్లు, లక్ష్యం చేసుకుంటున్నట్లులేదా వారికి ప్రమాదాన్ని కలిగిస్తున్నట్లు మేము గమనిస్తే, మేము చట్టపరమైన సంస్థలను హెచ్చరిస్తాము లేదా అవసరమైన కేసులు నమోదుచేస్తాము.

 • మైనర్‌లు ఉన్న లైంగికంగా ప్రేరేపించే కంటెంట్ లేదా లైంగికంగా మైనర్‌లను దుర్వినియోగం చేస్తున్న కంటెంట్‌కి TikTokకి అస్సలు చోటులేదు. అటువంటి కంటెంట్‌ని పోస్ట్ చేయవద్దు.
 • నగ్నత్వం, లైంగికంగా ప్రేరేపించే చర్యలు లేదా అవాంఛితంగా రెచ్చగొడుతున్న మైనర్‌లను కలిగిన కంటెంట్ ఉన్న వీడియోలకు యాక్సెస్‌నిTikTok తీసివేయవచ్చు లేదా పరిమితం చేయవచ్చు, అటువంటి వీడియోలను ఇతరులు అనుకోని విధాలుగా ఉపయోగించవచ్చు.
 • మైనర్‌లతో ఆన్‌లైన్ డేటింగ్, డబ్బులిచ్చి డేటింగ్ చేయడం లేదా పిల్లల గోప్యతకు భంగం కలిగించే లేదా పిల్లలకు శారీరకంగా, మానసికంగా అనార్యోగం కలిగించగల కంటెంట్‌ని పోస్ట్ చేయవద్దు, పంచుకోవద్దు లేదా పంపవద్దు.
 • మైనర్ వినియోగాదురలను వేధించే విధంగా పబ్లిక్ పోస్ట్‌లు లేదా ప్రైవేట్ సందేశాలు పంపవద్దు.
 • మీ వయస్సు 13 సంవత్సరాల కంటే లేద సేవా నిబంధనలలో మీ దేశం లేదా ప్రాంతానికి అవసరమైన కనీస వయస్సు కంటే తక్కువఅయితే మీరు యాప్‌ని ఉపయోగించవద్దు.

వేధింపులు లేదా బెదిరింపులు

మా వినియోగదారుల కోసం సానూకూల వాతావరణాన్ని మరియు దుర్వినియోగం లేని అనుభవాన్ని అందించడం కోసం మేముకష్టపడుతున్నాము. దయచేసి మీ సంభాషణలను సంస్కారవంతంగా ఉంచుకోండి మరియు వినియోగదారులందరినీ గౌరవించండి.

 • ఇతర వినియోగాదురలను వేధించే విధంగా పబ్లిక్ పోస్ట్‌లు మరియు/లేదా ప్రైవేట్ సందేశాలు పంపవద్దు.
 • ఇతరుల చిరునామా, ఫోన్ నంబర్, ఇమెయిల్ చిరునామా, ID సంఖ్య, క్రెడిట్ కార్డ్ సంఖ్య వంటి వారిని వ్యక్తిగతంగా గుర్తించగలసమాచారాన్ని బహిర్గతం చేయవద్దు.
 • ఉద్దేశ్యపూర్వకంగా ఇతరులను ఇబ్బంది పెట్టవద్దు, అవమానించవద్దు, వారి ప్రతిష్టకు భంగం కలిగించవద్దు లేదా వారిని బెదిరించవద్దులేదా ఇలా చేయడానికి ఇతరులను ప్రోత్సహించవద్దు.

ప్రతిరూపణ, స్పామ్ లేదా ఇతర తప్పుదారి పట్టించే కంటెంట్

అధిక నాణ్యత ఉన్న, వినియోగదారులను ఆకట్టుకునే కంటెంట్‌ని మా సంఘం గౌరవిస్తుంది. స్పామీ, నకిలీ లేదా తప్పుదారి పట్టించే కంటెంట్లేదా ప్రవర్తన తీసివేయబడుతుంది.

 • నకిలీ గుర్తింపులను సృష్టించడం, మరో వ్యక్తితో లేదా సంస్థతో మీకు సంబంధం ఉందో లేదో స్పష్టంగా తెలియజేయకపోవడం లేదా డబ్బుసంపాదించడం కోసం తప్పుదారి పట్టించే కంటెంట్‌ని పోస్ట్ చేయడం ద్వారా మరో వ్యక్తిని లేదా సంస్థను ప్రతిరూపణ చేయవద్దు.
 • వ్యాఖ్యలను విక్రయించడం, వ్యాఖ్యలు వ్రాయడం కోసం ఇతరులను నియమించుకోవడం లేదా మీరు ఇతరుల కోసం పని చేయడం, పునరావృత కంటెంట్‌ని పంచుకోవడం, చైన్ ఉత్తరాలను పంపడం మరియు వీక్షణలు, ఇష్టాలు లేదా వ్యాఖ్యలను పెంచుకోవడం కోసంమోసపూరితమైన సమాచారాన్ని ఉపయోగించడం వంటి పద్ధతుల ద్వారా కృత్రిమ ట్రాఫిక్‌ని రూపొందించవద్దు.

మేధోపరమైన ఆస్తి మరియు కార్యాలయ కంటెంట్

TikTok అన్నది విశిష్ఠమైన, వాస్తవ సృజనాత్మకతను, భావాలను వ్యక్తం చేయడానికి అందుబాటులో ఉన్న స్థలం.

 • ఇతరుల కాపీరైట్‌లు, వ్యాపారచిహ్నాలు లేదా ఇతర మేధోపరమైన ఆస్తి హక్కులను ఉల్లంఘించే కంటెంట్‌ని పోస్ట్ చేయవద్దు, పంచుకోవద్దు లేదా పంపవద్దు.
 • మీ యాజమాన్యం యొక్క అంతర్గత విధానాలను ఉల్లంఘించగల కంటెంట్ లేదా సమాచారాన్ని పోస్ట్ చేయవద్దు.

ఇతర మోసపూరితమైన కార్యకలాపం

ఎగువ పేర్కొన్న కంటెంట్ మరియు ప్రవర్తనతో పాటు, TikTok సేవకు అంతరాయం కలిగించే కార్యాచరణలను మా విధానాలు అనుమతించవు.

 • TikTok రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించవద్దు, దాని వెబ్‌సైట్ లేదా అనుబంధ నెట్‌వర్క్‌కు అంతరాయం కలిగించవద్దులేదా వినియోగదారు యాక్సెస్‌ని పరిమితం చేయడం కోసం దాని చర్యలను అధిగమించవద్దు.
 • వైరస్‌లు, ట్రోజన్‌లు, వార్మ్‌లు, లాజింక్ బాంబ్‌లు లేదా ఇతర మోసపూరితమైన లేదా సాంకేతికంగా హానికరమైన విషయాలను కలిగినఫైల్‌లను పంపిణీ చేయవద్దు.
 • ఫైల్‌లు, పట్టికలు లేదా పత్రాలతో పాటు TikTokని సవరించవద్దు, అనుకూలంగా మార్చుకోవద్దు, అనువదించవద్దు, సాంకేతికతనుమార్చవద్దు, డిసెంబుల్ చేయవద్దు, డీకంపైల్ చేయవద్దు లేదా దాని ఆధారంగా సమరూప ఉత్పత్తులను రూపొందించవద్దు, అలాగేTikTokలో ఉన్న సోర్స్ కోడ్, అల్గారిథమ్‌లు, పద్ధతులు లేదా సాంకేతికతలను తిరిగి రూపొందించడానికి ప్రయత్నించవద్దు.
 • TikTok నుండి సమాచారాన్ని సేకరించడం కోసం స్వయంచాలక స్క్రిప్ట్‌లను ఉపయోగించవద్దు.

మా సంఘంలో అద్భుతమైన సభ్యులుగా ఉన్నందుకు మరియు అందరికీ సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడంలో మీవంతు సహాయాన్ని అందించినందుకు ధన్యవాదాలు. సంఘం మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్న ఏదైనా కంటెంట్ మీకు కనిపిస్తే, దయచేసిదానిని మాకు నివేదించండి, మేము దానిని సమీక్షించి, సముచిత చర్య తీసుకుంటాము. మీకు ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే, దయచేసిprivacy@tiktok.comని సంప్రదించండి.

Updated on April 15, 2019

Was this article helpful?